హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ వస్తు, సేవల పన్ను(సవరణ) బిల్లు-2026’కు శాసనసభ ఆమోదం తెలిపింది. సోమవారం సభలో సీఎం రేవంత్రెడ్డి తరఫున పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ బిల్లును సభ ముందు ఉంచారు. నిరుడు నవంబరులో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ నూతన బిల్లును తీసుకొచ్చినట్టు మంత్రి తెలిపారు.
జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విధా నం ఉండాలనే ఉద్దేశంతో ఈ సవరణలు చేపట్టినట్టు మంత్రి చెప్పారు. కేంద్రం ఇప్పటికే తన పరిధిలోని ఐజీఎస్టీ, సీజీఎస్టీ చట్టాలను సవరించిందని, దానికి అనుగుణంగా చట్టంలో మార్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.