న్యూఢిల్లీ : భారత మాజీ ఆఫ్ స్పిన్నర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్ రెండోసారి తండ్రయ్యాడు. అతని భార్య, నటి గీతాబస్రా శనివారం మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. భగవంతుడి దయతో తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నాడు. ‘మేం చేయి పట్టుకుని నడిపించేందుకు ఓ చిన్న చేయి వచ్చింది. తన ప్రేమ బంగారం అంత విలువైనది, అద్భుతమైన బహుమతి. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. మా జీవితాలు పరిపూర్ణమయ్యాయి’ అంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశాడు.
గీతాబస్రాను అక్టోబర్ 29, 2015లో హర్భజన్ సింగ్ వివాహం చేసుకున్నాడు. ఇప్పటికే వారికి నాలుగేళ్ల పాప హనియా ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా భజ్జీ దంపతులకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 2016లో భారత జట్టుకు దూరమైన హర్భజన్.. ప్రస్తుతం ఐపీఎల్-2021 సీజన్లో కోల్కతా నైట్రైడ్స్ తరఫున ఆడుతున్నాడు. త్వరలోనే తమిళ సినిమా ‘ఫ్రెండ్షిప్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Blessed with a Baby boy 💙💙💙💙💙💙💙💙💙💙💙💙 shukar aa Tera maalka 🙏🙏 pic.twitter.com/dqXOUmuRID
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 10, 2021