మహమ్మారి ముప్పు తగ్గలేదు : WHO శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్
మహమ్మారి ముప్పు తగ్గలేదు | ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డెల్టా వేరియంట్‌తో కరోనా కేసులు పెరుగుతున్నాయని, మహమ్మారి తగ్గలేదనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డెల్టా వేరియంట్‌తో కరోనా కేసులు పెరుగుతున్నాయని, మహమ్మారి తగ్గలేదనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త పేర్కొన్నారు. పలు దేశాల్లో టీకాలు తీవ్రమైన కేసులు, ఆసుపత్రులకు వెళ్లడాన్ని తగ్గిస్తున్నా.. చాలా చోట్ల ఆక్సిజన్, ఆసుపత్రుల్లో పడకల కొరత ఎదురవుతోందని, భారీగా మరణాలు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
గత 24 గంటల్లో ఐదులక్షల కొత్త కేసులు నమోదయ్యాయని, సుమారు 9,300 మరణించారని పేర్కొన్నారు. ఆఫ్రికాలో గత రెండు వారాలుగా కొత్త కేసుల్లో 30 నుంచి 40శాతం వృద్ధి కనిపిస్తోందన్నారు. వీటిని పరిశీలిస్తే ‘కరోనా.. తగ్గే మహమ్మారి’లా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా సాగకపోవడం, ప్రజలు మాస్క్‌లు, సామాజిక దూరం నిబంధనలు పాటించకపోవడం, నిబంధనల సడలింపే కారణాలుగా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఫైజర్, మోడెర్నా టీకాలతో.. గుండె కణాల్లో వాపు
స్పేస్ రేస్.. అంతరిక్ష పర్యాటకంలో రసవత్తర పోటీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

