ఈ నెల 22 నుంచి పార్లమెంట్ వద్ద నిరసనలు : రాకేశ్ తికాయిత్
రైతుల నిరసన । ఈ నెల 22 నుంచి పార్లమెంట్ వద్ద 200 మంది రైతులతో పార్లమెంట్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్

న్యూఢిల్లీ : ఈ నెల 22 నుంచి పార్లమెంట్ వద్ద 200 మంది రైతులతో పార్లమెంట్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ శనివారం ప్రకటించారు. వ్యవసాయ చట్టాలపై కేంద్రం చర్చించాలనుకుంటే.. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చలు జరుగకపోయినా.. ఫలప్రదం కాకపోయినా రైతులు నిరననలు చేపడుతారన్నారు. చట్టాలపై రైతులు ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే.. ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు.
ఇటీవల కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బీకేయూ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాల సమస్యపై ఐక్యరాజ్య సమితిని సంప్రదిస్తామని తాము చెప్పలేదన్నారు. జనవరి 26న జరిగిన ఘటనపై దర్యాప్తునకు సంబంధించి మాట్లాడుతూ.. ‘దేశంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టే సంస్థ ఏదైనా ఉందా?.. లేక విషయాన్ని యూఎన్ దృష్టికి తీసుకువెళ్లాలా?’ అని పేర్కొన్నామని స్పష్టం చేశారు. గతేడాది కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
ఫైజర్, మోడెర్నా టీకాలతో.. గుండె కణాల్లో వాపు
స్పేస్ రేస్.. అంతరిక్ష పర్యాటకంలో రసవత్తర పోటీ
మహమ్మారి ముప్పు తగ్గలేదు : WHO శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

