– కాంగ్రెస్ను వీడిన 20 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరిక
– ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు ,తిప్పన విజయసింహ రెడ్డి
నల్లగొండ, ఏప్రిల్ 04 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని కొత్త నందికొండ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ ప్రజా మద్దతు పెరుగుతోంది. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కాటం మల్లికార్జున, మధు రాథోడ్ ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 20 కుటుంబాలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు ,తిప్పన విజయసింహ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై, మరలా అదే ప్రభుత్వం రావాలని కోరుకుంటూ వీరంతా స్వచ్ఛందంగా పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో రమావత్ రమేశ్, రమావత్ సత్యం, రామావత్ మైగ్య, రామావత్ శివ, రామావత్ రవి, హనుమంతు, రామావత్ నాగ, రామావత్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ధనావత్ బాలాజీ నాయక్, మాజీ జడ్పీటీసీ ఆంగోతు హతిరాం నాయక్, దున్దిగాల అంజయ్య, ముత్యాలు, అమరావతి సైదులు, చౌగాని భిక్షం గౌడ్, కొర్ర చిన్న నాయక్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.