‘ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెంపు’
ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెంపొందించుకోవచ్చని బూర్గంపహాడ్ ఎంపీడీవో జమలారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ బానోతు సరోజ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభించారు.
– బూర్గంపహాడ్ ఎంపీడీవో జమలారెడ్డి
బూర్గంపహాడ్, నవంబర్ 11 : ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెంపొందించుకోవచ్చని బూర్గంపహాడ్ ఎంపీడీవో జమలారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ బానోతు సరోజ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రతి ఊరికి ఊట కుంట… ప్రతి పంట పొలానికి పంట కుంట… ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నినాదంతో ప్రభుత్వం జలసిరి కార్యక్రమాన్ని తీసుకు వచ్చిందన్నారు. వర్షపు నీటిని వృథా కానీయకుండా భూమిలో ఇంకేలా చేయడంతో పాటు భూగర్భ జలాలను సంరక్షించడం, భవిష్యత్‌లో నీటి కొరతను నివారించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామంలో 20 ఇంకుడు గుంతలు మంజూరు అవగా వాటి నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. జల సంరక్షణలో ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి రవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు పెంపు’
Jammu Kashmir: సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఫైరింగ్.. కశ్మీర్లో ముగ్గురికి గాయాలు
Mother Dairy: మదర్ డెయిరీ, అముల్ పాలు మరింత ప్రియం.. లీటర్‌పై రూ.6 వరకు పెంపు
దుబ్బాకను కరువు ప్రాంతంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ షోకి చీఫ్ గెస్ట్‌గా రెబల్ స్టార్ ప్రభాస్?.. టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన క్రేజీ న్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

