రంగారెడ్డి : వివాహం జరిగిన రెండు రోజులకి వరుడు మృతి చెందిన విషాదకర సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బడంగ్‌పేట్‌లోని లక్ష్మీదుర్గ నగర్ కాలనీకి చెందిన సాయి అనిల్ కుమార్(26) ఈనెల 7వ తారీఖున వివాహం జరిగింది.
8వ తారీకు తెల్లవారుజామున వధువుతో ఇంటికి చేరుకోగానే గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. వివాహం జరిగిన రెండు రోజులకే వరుడు మృతి చెందడంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి.