నకిరేకల్, మార్చి 20 : సూర్యాపేటలో జరుగనున్న జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నకిరేకల్ పట్టణంలోని బైపాస్ వద్ద పద్మానగర్ జంక్షన్లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ నాయకులు గురువారం ఘన స్వాగతం పలికారు. కేటీఆర్‌ను శాలువాతో సత్కరించి బొకేలు అందించారు.
కేటీఆర్‌ను చూడగానే కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా జై కేసీఆర్..జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలకు, నాయకులకు అభివాదం చేస్తూ కేటీఆర్ సూర్యాపేటకు బయల్దేరి వెళ్లారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్‌రెడ్డి, సోమ యాదగిరి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ తరాల బలరాం, నాయకులు పెండెం సదానందం, నోముల కేశవరాజు, దైద పరమేశం, యానాల లింగారెడ్డి, చేతన్, వీరయ్య, కృష్ణకాంత్ పాల్గొన్నారు.
నార్కట్‌పల్లిలో..
నార్కట్‌పల్లి : సూర్యాపేటకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నార్కట్‌పల్లి శివారులోని వివేరా హోటల్ వద్ద మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్ ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులు ఉన్నారు.