రామవరం, సెప్టెంబర్ 25 : సింగరేణిలో మైన్ యాక్సిడెంట్లో చనిపోయిన ఉద్యోగుల డిపెండెంట్లకు 2009 అగ్రిమెంట్ ప్రకారం ఆనాడు గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ ఒప్పందం మేరకు సంస్థలో ఉన్న టెక్నికల్ అర్హత కలిగిన డిపెండెంట్లకు మాత్రమే సూటబుల్ ఎంప్లాయిమెంట్ సూపర్వైజర్గా, టెక్నీషియన్స్ గా అవకాశం కల్పించబడింది. కానీ నాన్ టెక్నికల్ డిగ్రీ కలిగి ఏదేని ఉద్యోగి ప్రమాదంలో చనిపోతే వారి డిపెండెంట్లకి అండర్ గ్రౌండ్ జనరల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రమాదాలు జరిగి చాలామంది ఉద్యోగులు చనిపోయారు. వారి పిల్లలకు సూటబుల్ ఉద్యోగాన్ని యాజమాన్యం కల్పించలేదు. అందువల్ల గుర్తింపు సంఘంగా ఎన్నికైన తర్వాత ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రక్చరల్ కమిటీలో ఈ డిమాండ్ ని చేర్చి యాజమాన్యంతో అగ్రిమెంట్ చేయించడం జరిగింది.
ఇది చట్టబద్ధంగా ఉండాలని, పారిశ్రామిక వివాదాల చట్టం 12 (3) ప్రకారం ట్రైపార్టెంట్ అగ్రిమెంట్ గురువారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎల్పీ సమక్షంలో యాజమాన్యం, గుర్తింపు సంఘం నాయకుల మధ్యన అధికారిక వ్రాతపూర్వక ఒప్పందం జరిగింది. అలాగే ఏదైనా ఉద్యోగి ఈ మధ్యకాలంలో మైన్ యాక్సిడెంట్‌కు గురై చనిపోయి వారి వారసులకు జనరల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్లయితే వారందరూ కూడా ఈ ఒప్పందం ప్రకారం సూటబుల్ ఎంప్లాయిమెంట్ నాన్ టెక్నికల్ వారందరికీ గ్రేడ్ 3 క్లర్క్ (మినిస్ట్రియల్ స్టాఫ్) ఉద్యోగం కల్పించబడుతుంది. అందువల్ల అర్హులు ఎవరైనా ఉన్నచో సర్కులర్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి.
సింగరేణి ఉద్యోగుల దృష్టిలో ఉన్న ప్రతి డిమాండ్‌ను ఇప్పటికే స్ట్రక్చరల్ కమిటీలో పెట్టి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి చర్చించి అన్ని డిమాండ్లను పరిష్కరించుటకు గుర్తింపు సంఘం కృషి చేస్తుంది. ఇప్పటికే కొన్ని ఒప్పందాలను అమలు చేస్తూ సర్కులర్లను యాజమాన్యం జారీ చేసింది. ఇంకా కొన్ని సర్కులర్లు రావాల్సి ఉన్నవి. కొన్ని డిమాండ్లు కమిటీలు వేసి కమిటీ రిపోర్ట్ ప్రకారం అమలు చేయుటకు యాజమాన్యం సిద్ధంగా ఉంది. దీనిని గని కార్మికులు దృష్టిలో ఉంచుకుని గుర్తింపు సంఘంపై విశ్వాసం ఉంచాలని నాయకులు పేర్కొన్నారు.
Ramavaram : మైన్ యాక్సిడెంట్లో చనిపోయిన ఉద్యోగుల డిపెండెంట్లకు గ్రేడ్ 3 క్లర్క్ ఉద్యోగాలు