Organic Methods | రాయపోల్, సెప్టెంబర్ 25 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ముంగిస పల్లి, పెద్ద ఆరేపల్లి గ్రామాల్లో భారత నవ నిర్మాణ సంస్థ (Better Cotton Project) ఆధ్వర్యంలో గురువారం పత్తి రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రైతులకు రసాయనాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతులను అనుసరించాలని సూచించారు. వావిలకు కషాయం పిచికారీ చేయడం వలన పచ్చదోమ, పెనుబంక, తెల్లదోమ వంటి రసంపీల్చే పురుగులు నశిస్తాయని తెలిపారు. అదేవిధంగా అగ్నియస్త్రం వాడకంపై వివరించి, వావిలకు తయారీ విధానం చూపించారు.
పత్తిలో వచ్చే గులాబీ పురుగును నివారించడానికి లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, అంతర పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. ఎర పంటలుగా బంతి, ఆముదం వేసుకోవడం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవచ్చని వివరించారు.
ఈ సందర్భంగా మహిళలు వ్యవసాయంతో పాటు అన్ని రంగాలలో ముందుకు రావాలని మారి సంస్థ ప్రతినిధులు సూచించారు. పత్తి పంటలో సమగ్ర సస్యరక్షణ విధానాలను పాటించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో భాస్కర్ తో పాటు ఫీల్డ్ ఫెసిలిటేటర్లు పాల్గొన్నారు.
Woman Molest | వివాహితపై పోలీసుల అఘాయిత్యం.. కేసు నమోదు
Mulugu | ములుగు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం..
KCR | కొంపెల్లి వెంకట్ గౌడ్ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు : కేసీఆర్