చండూరు, నవంబర్ 05 : నిత్యం కురుస్తున్న వర్షాలతో చండూరు మండలంలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం చండూరులో ఆయన మాట్లాడుతూ.. గత వారం రోజులుగా కురిసిన వర్షం కారణంగా వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదన్నారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టం అంచనా వేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలన్నారు. తడిసిన వరి ధాన్యాన్ని కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్లకు నల్లగింజ, తేమ ఉన్నా, రైస్ మిల్లర్లు వెనక్కి పంపకుండా కొనుగోలు చేయాలని, పత్తి రంగు మారినా, మ్యాచర్ తో సంబంధం లేకుండా సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని ఆయన పేర్కొన్నారు.