RT76 | రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి పసందైన వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. ఇప్పటికే విడుదలైన మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న చిత్రం RT76. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఇటీవలే స్పెయిన్‌లో షూటింగ్ కొనసాగుతున్నట్టు తెలియజేస్తూ రవితేజ టీం రిలీజ్ చేసిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్పెయిన్‌లో సాంగ్ షూట్ పూర్తి చేసినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది రవితేజ టీం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ మూవీలో ఖిలాడి ఫేం డింపుల్ హయతి కూడా నటిస్తోంది. లొకేషన్లో రవితేజతో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. చార్ట్ బస్టర్ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ విషయాన్ని షేర్ చేసింది డింపుల్ హయతి.
ఈ సాంగ్ షూట్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ ప్రాజెక్టు 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Dies Irae | మోహన్‌లాల్ కొడుకు కొత్త మూవీ.. ‘డీయాస్ ఈరే’ తెలుగు ట్రైలర్ రిలీజ్
Peddi First Single | ‘పెద్ది’ అప్డేట్ వచ్చేసింది.. ‘చికిరి’ వీడియో పంచుకున్న టీమ్
Mira Nair Son | న్యూయార్క్ మేయర్‌గా భారతీయ దర్శకురాలి కొడుకు.. ఎవరీ జోహ్రాన్ మమ్దానీ?