మక్తల్ : రాష్ట్రంలో పేదోడి కలను సహకారం చేసి వారి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ( Minister Vakiti Srihari ) అన్నారు. బీమా ఫేస్ వన్లోని స్టేజ్ టు కంపాస్ నుంచి తిరుమలయ్య చెరువుకు నీరు వెళ్లే పాత కాలువను మంత్రి పరిశీలించారు. పట్టణంలోని పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నర్వ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్లను ( Proceedings ) లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టు నుంచి ప్రతి చెరువు నింపి సాగుకు నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో నర్వ మండలానికి రూ. 150 కోట్లు కేటాయించి అగ్రగామిగా నిలబెడతానన్నారు. కార్యక్రమంలో నారాయణపేట జడ్పీ సీఈవో శైలేష్, హౌసింగ్ పీడీ శంకర్, డీఈ హరికృష్ణ, తహసీల్దార్ మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.