చేగుంట : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ( Grain) ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ( MLA Kotha Prabhakar Reddy ) కోరారు. నార్సింగి మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మండలంలోని పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ఎలాంటి ఇబ్బందులు లేకుండ కొనుగోలు చేయాలని, కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించాలన్నారు. ఎక్కువ తరుగులు లేకుండా, డబ్బులు తొందరగా వచ్చే విధంగా ప్రభుత్వం,అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో చేగుంట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కోమండ్ల నారాయణరెడ్డి, జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో చిన్నారెడ్డి, ఏవో హరిప్రసాద్, మాధవి, ఏపీఎం లక్షీ నర్సమ్మ, ఐకెపీ సిబ్బంది తదితరులున్నారు.