నార్నూర్ : 49 జీవో నెంబర్ను రద్దు చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి ( Adivasi Hukula Porata Samiti ) తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పేందూర్ దాదిరావు డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ జాడీ రాజా లింగంకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసి చట్టాలను అమలు చేయాల్సింది పోయి కొత్త జీవోలతో ఆదివాసులను అణచివేతకు రాష్ట ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు పూనుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
49 జీవో తో ఆదివాసి గ్రామాలను ఖాళీ చేయాలని, ఖనిజ సంపదను దోచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ఈ జీవో నెంబర్ను రద్దు చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మెస్రం మానిక్ రావు, మండల అధ్యక్షుడు ఆడ శ్రీరామ్. కార్యనిర్వహణ అధ్యక్షుడు మడవి సాగర్, నాయకులు మెస్రం మోతిరామ్, రమేష్, జంగు తెలంగ్ రావు, యశ్వంత్ తదితరులున్నారు.