రాత్రిళ్లు తొందరగా, ఎక్కువసేపు పడుకొంటే టీనేజీ వయసువాళ్ల మెదడు పదునెక్కుతుందట. కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని కనుక్కొన్నారు. త్వరగా పడుకొని, ఎక్కువసేపు నిద్రించిన వాళ్లతో పోలిస్తే మిగిలిన వాళ్లు.. లెక్కలు చేయడం, పదజాలం, చదవడం లాంటి మేధాశక్తికి సంబంధించిన పరీక్షల్లో చాలా వెనకబడ్డారని ఈ పరిశోధనలో తేలింది.
“నిద్రించే సమయంలో మనం జ్ఞాపకాలను సంఘటితం చేసుకుంటాం కాబట్టి, నిద్ర మన మెదడు సామర్థ్యాన్ని పెంచుతుంది” అని ఈ అధ్యయన బృంద నాయకుడు బార్బరా సహాకియాన్ వెల్లడించారు. కాబట్టి, పిల్లల నిద్రించే వేళలు, నిద్రలో నాణ్యత విషయంలో పెద్దలు తగినంత శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే వాళ్లు జీవితంలో రాణిస్తారు.