న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: బంగారం పరుగు ఇప్పట్లో ఆగేటట్టు కనిపించడం లేదు. వరుసగా 4 రోజులుగా పెరుగుతున్న పుత్తడి విలువ మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.1,13,800 పలికింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.700 అధికమై రూ.1,13,800కి చేరుకున్నది.
దీంతో ప్రస్తుత సంవత్సరంలో బంగారం ధర రూ.34,850 లేదా 44.14 శాతం ఎగబాకినట్టు అయింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర రూ.1,13, 300కి చేరుకున్నది. వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన కిలో వెండి రూ.4 వేలు ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1.32 లక్షలు పలికింది.