Gold Rates | హైదరాబాద్ : బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు పసిడి ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. అమాంతం పెరిగిన ధరలతో పసిడి ప్రియులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోవడంతో ఇవేం ధరలు బాబోయ్ అని అంటున్నారు. హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి.
హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,02,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,11,280గా ఉంది. నిన్నటి ధరలతో పోల్చితే 22 క్యారెట్ల గోల్డ్ రూ. 700 ఎగబాకగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 771 ఎగబాకింది. దీంతో గోల్డ్ లవర్స్ ఆగమైపోతున్నారు. ఈ స్థాయిలో ధరలు పెరిగితే బంగారం కొనెదేలా అని ప్రశ్నించుకుంటున్నారు.
ఇక ఈ ఏడాది ఆరంభంతో ఈ ధరలను పోల్చితే.. నేటికి 42 శాతం రెట్టింపు అయ్యాయి గోల్డ్ రేట్స్. జనవరి నెలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78 వేలు ఉండే. కానీ ఇప్పుడు ఆ ధరలు 42 శాతం జంప్ కావడంతో బంగారం ప్రియులు లబోదిబోమంటున్నారు.