రోజుకు 10 లక్షలదాకా.. యూపీఐ లావాదేవీల పరిమితి పెంపు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగదారులకు మరింత ఉత్సాహాన్నిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ).. ఆయా లావాదేవీలకున్న పరిమితుల్ని పెంచింది. ఈ నెల 15 నుంచి పర్సన్-టు-మర్చంట్ (వ్యక్తులు-వ్యాపారుల మధ్య) చెల్లింపులు ఇంకా పెద్ద మొత్తాల్లో చేసుకోవచ్చని తాజాగా పేర్కొన్నది.
- ఇక పర్సన్- టు-మర్చంట్ పేమెంట్స్‌కు ఊతం
- 15 నుంచి మార్పులు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగదారులకు మరింత ఉత్సాహాన్నిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ).. ఆయా లావాదేవీలకున్న పరిమితుల్ని పెంచింది. ఈ నెల 15 నుంచి పర్సన్-టు-మర్చంట్ (వ్యక్తులు-వ్యాపారుల మధ్య) చెల్లింపులు ఇంకా పెద్ద మొత్తాల్లో చేసుకోవచ్చని తాజాగా పేర్కొన్నది. దీంతో ఆయా రంగాల్లో డిజిటల్ పేమెంట్స్ ఊపందుకునే వీలున్నది. మరోవైపు చెక్కులు లేదా బ్యాంక్ శాఖల ద్వారా జరిగే లావాదేవీలు తగ్గిపోనున్నాయి. కాగా, పర్సన్-టు-పర్సన్ (వ్యక్తులు-వ్యక్తుల మధ్య) లావాదేవీకున్న పరిమితి మాత్రం రోజుకు లక్ష రూపాయలుగానే ఉన్నది. ఇందులో ఎలాంటి మార్పూ లేదు. ఇక ఎన్పీసీఐ తాజా వివరాల ప్రకారం..
- క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడులు, బీమా చెల్లింపులకు సంబంధించి ఒక్కో లావాదేవీకున్న పరిమితి రూ.2 లక్షల నుంచి 5 లక్షలకు పెరిగింది. రోజుకు గరిష్ఠంగా రూ.10 లక్షలదాకా లావాదేవీలు జరుపుకోవచ్చు.
- ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం పోర్టల్)పై నగదు డిపాజిట్లు, పన్ను చెల్లింపులకు సంబంధించి ఒకేసారి రూ.5 లక్షలదాకా లావాదేవీని జరుపుకోవచ్చు. ప్రస్తుతం ఇది లక్ష రూపాయలుగానే ఉన్నది.
- ట్రావెల్స్‌కు సంబంధించి ఒకేసారి రూ.5 లక్షలదాకా లావాదేవీ చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిమితి లక్ష రూపాయలే. అయితే రోజుకు రూ.10 లక్షలదాకా లావాదేవీలు జరుపుకోవచ్చు.
- క్రెడిట్ కార్డుల బిల్లు చెల్లింపులు ఒకేసారి రూ.5 లక్షలదాకా చేసుకోవచ్చు. కానీ రోజుకు రూ.6 లక్షలు దాటరాదు.
- రుణం, ఈఎంఐ కలెక్షన్ల కోసం వినియోగదారులు ఒకేసారి రూ.5 లక్షలదాకా లావాదేవీ జరుపుకోవచ్చు. రోజువారీ పరిమితి రూ.10 లక్షలు.
- యూపీఐ ద్వారా నగల కొనుగోళ్లకున్న లావాదేవీ పరిమితి లక్ష రూపాయల నుంచి రూ.2 లక్షలకు పెరిగింది. రోజుకు రూ.6 లక్షలదాకా లావాదేవీలు చేసుకోవచ్చు.
- డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ద్వారా టర్మ్ డిపాజిట్ల వంటి బ్యాంకింగ్ సేవలకున్న లావాదేవీల పరిమితి రూ.2 లక్షల నుంచి 5 లక్షలకు పెరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

