Medaram Jatara : ఆసియాలోనే పెద్దదైన మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదివాసీలు దేవతామూర్తిగా కొలిచే సమ్మక్క (Sammakka) గద్దెపై కొలువుదీరింది. శుక్రవారం చిలుకల గుట్ట వద్ద పూజుల చేసిన పూజారులు మేడారానికి సమ్మక్కకు తీసుకొచ్చారు. తల్లికి గౌరవసూచకంగా ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాత కేకన్ గాల్లోకి కాల్పులు జరిపారు.
రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరలో సమ్మక్క రాకతో భక్తజనం పులకించిపోయింది. నిన్న(బుధవారం) సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులు గద్దెలపై చేరుకున్నారు. సమ్మక్క రాక సందర్భంగా శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. భక్తులు ఎదురుకోళ్లతో స్వాగతం పలుకగా.. డోలు, వాయిద్యాల నడుమ కోలాహలంగా గద్దెనెక్కింది సమ్మక్క. సమ్మక్క తల్లి కూడా రావడంతో భక్తజనం ఆమెను దర్శించుకొని, ఆశీర్వాదాలు తీసుకునేందుకు పోటీపడుతున్నారు.
వనం నుంచి జనంలోకి సమ్మక్క.. చిలకలగుట్ట వద్ద గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం పలికిన ములుగు ఎస్సీ రాంనాథ్ కేకన్#MedaramJatara2026 #Medaram #sammakka pic.twitter.com/WzpcAzVR65
— Nikhil Kumar Sangani (@Nikhil_Journo) January 29, 2026
రాష్ట్ర నలుమూలల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి మేడారం జాతరను తిలకించేందుకు భారీగా భక్తులు తరలి రావడంతో మేడారంలో గద్దెల ప్రాగణం కిటకిటలాడుతోంది. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Medaram Jatara’s grand moment!
Welcoming Sammakka with Gun fire.#SammakkaSarakka #MedaramJatara pic.twitter.com/AzkHD0PpFq
— Danasari Seethakka (@seethakkaMLA) January 29, 2026