UPWW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. వరుసగా ఐదు విజయాలతో ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ ఆపై రెండు ఓటముల నుంచి తేరుకొని యూపీ వారియర్స్‌పై పంజా విసిరింది. 149 పరుగుల ఛేదనలో ఓపెనర్ గ్రేస్ హ్యారిస్(75) అర్ధ శతకంతో విరుచుకుపడగా.. స్మృతి మంధాన(54 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. దాంతో, 8 వికెట్ల తేడాతో గెలుపొందిన బెంగళూరు 12 పాయింట్లతో నాలుగో సీజన్ ఫైనల్లో అడుగుపెట్టింది.
డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. నాలుగో సీజన్లో వరుసగా ఐదు విజయాలతో ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ.. లీగ్ దశ చివరి పోరులోనూ చెలరేగింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొడుతూ యూపీ వారియర్స్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 149 పరగుల మోస్తురు ఛేదనలో గ్రేస్ హ్యారిస్(75), స్మృతి మంధాన(54 నాటౌట్)ల విధ్వంసంతో యూపీ బౌలర్లు నీరుగారిపోయారు.
Presenting the first finalist of #TATAWPL 2026 🥳
Make way for the @RCBTweets ❤️#KhelEmotionKa | #UPWvRCB pic.twitter.com/qXkTOUJzIk
— Women’s Premier League (WPL) (@wplt20) January 29, 2026
హ్యారిస్ ఔటయ్యాక మరింత జోరు పెంచిన మంధాన.. శోభన ఓవర్లో భారీ సిక్సర్ బాదిన మంధాన.. సింగిల్ తీసి 26 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. విజయానికి 9 పరుగుల దూరంలో జార్జియా వోల్(16) బంతిని అంచనా వేయలేక సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన రీచా ఘోష్(0 నాటౌట్)తో కలిసి లాంఛనం పూర్తి చేసింది కెప్టెన్. 13.1 ఓవర్లోనే ఛేదించి యూపీకి దిమ్మతిరిగే షాకిచ్చిన బెంగళురు 12 పాయింట్లతో ఫైనల్ బెర్తు పట్టేసింది.
Top of the table ✅
Final spot sealed ✅@RCBTweets with yet another 𝗕𝗢𝗟𝗗 show in #TATAWPL 2026 ❤️🥳Updates ▶️ https://t.co/IgbbgWV0xt #KhelEmotionKa | #UPWvRCB pic.twitter.com/xuAox6fGWG
— Women’s Premier League (WPL) (@wplt20) January 29, 2026
ప్లే ఆఫ్స్ చేరాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌కు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. పవర్ ప్లేలోనే వికెట్లు తీసి ఒత్తిడి పెంచే లారెన్ బెల్‌ను దీటుగా ఎదుర్కొన్న మేగ్ లానింగ్(41), దీప్తి శర్మ(55)లు ధనాధన్ ఆడారు. తొలి వికెట్‌కు 74 రన్స్ జోడించి భారీ స్కోర్‌కు బాటలు వేసిన ఈ ద్వయాన్ని నడినే డీ క్లెర్క్ (4-22) విడదీసిది.
Innings Break! #UPW set a target of 1⃣4⃣4⃣ 🎯
Will they defend it or will #RCB chase it down? 🤔
Scorecard ▶️ https://t.co/IgbbgWV0xt #TATAWPL | #KhelEmotionKa | #UPWvRCB pic.twitter.com/nxBzlaOFGL
— Women’s Premier League (WPL) (@wplt20) January 29, 2026
డేంజరస్ లానింగ్‌ను పెవిలియన్ పంపిన తను.. అమీ జోన్స్(1)ను ఔట్ చేసి మరో బ్రేకిచ్చింది. ఆ తర్వాత వచ్చినవాళ్లేవరూ క్రీజులో నిలువలేదు. అర్ధ శతకంతో యూపీ స్కోర్ 130 దాటించిన దీప్తిని శ్రేయాంక పాటిల్ వెనక్కి పంపింది. ఆ తర్వాత పరుగుల చేసేవారు కరువవ్వడంతో యూపీ నిర్ణీత ఓవర్లలో 148కే పరిమితమైంది.