నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు తొలి సమావేశం
గోదావరి నదీ యాజమాన్య బోర్డు | గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) కో ఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం ఇవాళ జరుగనుంది. అయితే, దీనికంటే ముందుగా

హైదరాబాద్ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) కో ఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం ఇవాళ జరుగనుంది. అయితే, దీనికంటే ముందుగా పూర్తిస్థాయి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలని జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్‌లో జరిగే సమావేశంపై సందిగ్ధం నెలకొన్నది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుండగా ఆలోపు పూర్తిచేయాల్సిన కార్యాచరణపై కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. ఇందుకోసం సమన్వయ కమిటీలు ఏర్పాటుచేశారు.
ఈ క్రమంలో రెండుబోర్డులు సమన్వయ కమిటీ తొలిసమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేశాయి. బోర్డులకు సంబంధించిన ఉద్యోగుల నియామకం, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్‌పై దృష్టి పెట్టాలన్న సూచనల మేరకు కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ నిర్ణయించాయి. ముందుగా బోర్డు మీటింగ్ నిర్వహించాలని తెలంగాణ కోరింది. ఆ లేఖపై స్పందించిన జీఆర్ఎంబీ నోటిఫికేషన్ అమలుకు నిర్ధిష్ట గడువులతో తక్షణ కార్యాచరణ ఖరారు చేయాలని కేంద్ర జలశక్తిశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. అమలు కార్యాచరణ, గడువులపై సమన్వయ కమిటీలో.. చర్చించాల్సిన అవసరం ఉందని, వాటిపై చర్చించి తగిన చర్యలు తీసుకున్న తర్వాత.. బోర్డు పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

