భద్రాచలం: ఎగువ నుంచి వరద పోటెత్తడంతో గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం (Bhadrachalam) వద్ద 48 అడుగులు దాటి ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. స్నాన ఘట్టాల ప్రాంతం వద్ద చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగాయి. కల్యాణ కట్ట వరకు వరద నీరు చేరింది.
నీటిమట్టం పెరడంతో అప్రమత్తమైన అధికారులు.. భక్తులు స్నానాలు చేయడానికి నదిలోకి వెళ్లొద్దని ఆదేశాలు జారీచేశారు. తూరబాక వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరదతో వీఆర్పురం, కూనవరం, చింతూరు మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.