మంచిర్యాల, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టామ్కామ్ ద్వారా నాలుగు నెలల్లో జర్మనీ భాష నేర్పించి, నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు.
బుధవారం ఆయన మంచిర్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. జర్మనీలో ఏటా ఐదు లక్షల ఉద్యోగాలు అవసరం ఉన్నదని, ఏటా మన రాష్ర్టానికి 90 వేల వీసాలు ఇచ్చేందుకు ఆ దేశం ముందుకొచ్చిందని తెలిపారు.