నారాయణపేట, ఏప్రిల్ 15 : కాంగ్రెస్ పాలనలో రైతులు పంటలు పండించుకోవాలన్నా… చేతికి వచ్చి న పంటలను విక్రయించుకోవాలన్నా ఇబ్బందులు తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేసే కొ నుగోలు కేంద్రాలను నారాయణపేట జి ల్లాలో ఏర్పాటు చే యకపోవడం వ ల్ల రైతులు నే రుగా మిల్లర్లకు, ప్రై వేటు లవ్యాపారులకు అమ్మి నష్టపోయే పరిస్థితులు దాపురించాయి. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్వయంగా కలెక్టర్ సమీక్ష చేసి సంబంధిత అధికారులకు సూచనలు చేసి ఐదు రోజులు గడుస్తున్నా ఆ దిశగా సంబంధిత అధికారులు పూనుకోకపోవడంతో రైతులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
చేసేది లేక జిల్లాలోని మాగనూరు మండలం వరూరు గ్రామానికి చెందిన రైతులు బుధవారం ఏకంగా కల్లాల వద్ద ఆందోళనలు చేసే పరిస్థితి ఏర్పడింది. గత రెండు సంవత్సరాల నుంచి కూడా వానకాలం, యాసంగిలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలను ఒకేసారి కాకుండా విడుతల వారీగా ఏర్పాటు చేయడం, ఒకో దశలో సీజన్ ముగిసే మధ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కేంద్రాలను ఏర్పాటు చేశామా లేదా అన్న రీతిలో ఆఖర్లో ఏర్పాటు చేసి మమ అని చేతులు దులుపుకొన్న పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ సారి అలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై ఈ నెల 10వ తేదీన కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత పౌరసరఫరాల, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన మొత్తం కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఈ యాసంగి సీజన్లో ఎంత లక్ష్యం పెట్టుకున్నారని వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎకడ కూడా గన్నీ బ్యాగుల కొరత రాకుండా చూడాలని, వేసవి దృష్ట్యా తాగునీరు వంటి సదుపాయాలను కల్పించాలని కూడా సూచించారు. అంతా వరకు బాగానే ఉన్నానేటికీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జరుగలేదు.
వరి కోతలు ప్రారంభమయ్యాయని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల దళారులకు, మిల్లర్లకు విక్రయించూసుకోవాల్సిన పరిస్థితి వస్తోందని దీని వల్ల చాలా నష్ట పోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాలంలో రైతులకు వానకాలం, యాసంగి రెండు సీజన్లలో పంట పెట్టుబడి సహాయాన్ని అదించడమే కాకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో బిల్లులు చెల్లించే వారని కానీ.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పంట పెట్టుబడి సహాయం నాన్న పులి వచ్చే అన్నట్లుగా మారిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంటల విక్రయ సమయంలో రైతులు ఇబ్బందులు పడరాదనే ఉద్దేశంతో నేరుగా కల్లాల వద్దకే అధికారులను పంపించి ధ్యానం కొనుగోలు చేసిన రోజులను ఈ సందర్భంగా రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ విషయంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
కేంద్రాల్లేక కర్ణాటకకు ధాన్యం
ధన్వాడ, ఏప్రిల్ 15 : మండలంలోని వివిధ గ్రామాల్లో యాసంగిలో రైతులు వరిని విరివిగా సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికి రాగా.. కొన్ని చోట్ల కోతలు పూర్తవగా.. ప్రభుత్వం మాత్రం నేటికీ ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో ధాన్యం విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. సెంటర్లు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం జాప్యం వహిస్తుందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. కొందరు రైతులు చేసేది లేక పక్కనున్న కర్ణాటకకు వరిని తరలిస్తున్నారు. అలాగే గతేడాది రైతుల ఆమ్మిన వరికి నేటికీ బోనస్ అందలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లో బోనస్తోపాటు విక్రయ డబ్బులను సంబంధిత రైతు ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటికీ బోనస్ అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Mahabubnagar
ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మాగనూర్, ఏప్రిల్ 15 : ఉమ్మడి మాగనూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని వర్కూర్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కల్లాల వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతు లందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరు గాలం కష్టపడి పంటలు పండిస్తే కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయకపోవడంతో దళారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
మండలలో ఇప్పటి వరకు దాదాపు 50 శాతం వరి కోతలు ముగిశాయని రైతులు కోత లు కోసి గతంలో ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల వద్దనే కుప్పలు పోసుకోవడంతో మిగతా రైతులకు వడ్లు అరబెట్టుకోడానికి స్థలం లేక రైతులు పొలాల వద్దే ఆరబెట్టుకోవాల్సి వస్తోందని, అటు నుంచి మళ్లీ కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోవడం అదనపు భారంగా మారిందన్నారు. ప్రభుత్వం ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తే రైతు లకు ఇబ్బందులు తొలుగుతాయన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి అయిన ఈ విషయంలో స్పందించి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.