CJP : నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం మూడు ప్రధాన డిమాండ్లకు అంగీకరించింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) రాజీనామా అనంతరం శనివారం సాయంత్రం కాన్టిట్యూషన్ క్లబ్లో సీజేపీ సభ్యులతో భేటీ అయిన మంత్రులు జేపీ నడ్డా (JP Nadda), జితేంద్ర సింగ్(Jitendra Singh)లు వారి డిమాండ్లకు సరేనన్నారు. దాంతో. ప్రభుత్వం తమ మూడు డిమాండ్లకు అంగీకరించిందని సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రన్కాలు మీడియాకు వెల్లడించారు.
కేంద్ర మంత్రులతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల చర్చలు ఫలించాయి. నీట్ పేపర్ లీకేజీపై జవాబుదారీతనం కోరుతూ, మూడు ప్రధాన డిమాండ్లతో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన సీజేపీ తమ పంతం నెగ్గించుకుంది. శనివారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కాన్టిట్యూషనల్ క్లబ్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్లతో భేటీ అయిన సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రన్కాలు చర్చలు విజయమవంతమయ్యాని చెప్పారు.
VIDEO | Delhi: After talks between the CJP delegation and the government, during a joint press conference, with Union Ministers Jitendra Singh and JP Nadda, CJP ‘s Saurav Das says, “The CJP declares that we withdraw the agitation in good faith and understanding that the agreed… pic.twitter.com/4kmBNDFER3
— Press Trust of India (@PTI_News) July 25, 2026
‘ప్రభుత్వ ప్రతినిధులతో మూడు రౌండ్లు చర్చలు జరిపాం. మూడు ప్రధాన డిమాండ్లతలో మేము జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా నిరసన చేపట్టాం. వీటిలో మొదటిది.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నిరసనకారులు, సీజేపీ నేతలపై పోలీసులు పెట్టిన కేసులు, ఎఫ్ఐఆర్లను విరమించుకోవాలి. అంతేకాదు.. భవిష్యత్తులో నీట్ నిరసనకారులపై ఎలాంటి కేసులు పెట్టొద్దు. అలానే నీట్ పరీక్ష రద్దుతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటంబాలకు రూ.1 కోటి పరిహారం చెల్లించాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో మా మొదటి డిమాండ్ నెరవేరింది. మిగతా డిమాండ్లపై ప్రభుత్వ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఒకట్రెండు రోజుల్లో రాతపూర్వకంగా ఇస్తామని మంత్రులు తెలిపారు’ అని సీజేపీ జాతీయ మీడియా ప్రతినిధి అశుతోష్ వెల్లడించాడు.
This is democracy. He has resigned. We have two more demands. We won’t go like this.
Dharmendra Pradhan has resigned. But the families of the children who committed suicide should receive compensation of one crore rupees. They should get it.
One crore rupees compensation to all… pic.twitter.com/CyhfGDUola— Cockroach is Back (@Cockroachisback) July 25, 2026
సీజేపీ ప్రతినిధులతో భేటీ, డిమాండ్లకు అంగీకారం అనంతరం మంత్రి జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. మీరు మా ముందు ఉంచిన డిమాండ్లపై, విద్యా వ్యవస్థలో సూచించిన సంస్కరణలపై మేము అధ్యయనం చేస్తాం. మీ పార్టీకి చెందిన మరికొందరు ప్రతినిధులతో కూడా చర్చలు జరుపుతాం. అలానే.. నష్టపరిహారంపై నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకుంటాం అని నడ్డా పేర్కొన్నారు.