Revanth Reddy | మరోసారి ముఖ్యమంత్రి డైవర్షన్ డ్రామా.. 20న జగిత్యాల బీఆర్ఎస్ సభతో బెంబేలు
సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి డైవర్షన్ డ్రామాకు తెరలేపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కుతంత్రం పన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ అంటేనే వణికిపోతున్న ఆయన.. జగిత్యాలలో బీఆర్ఎస్ సభ జరిగే 20వ తే దీన్నే మేడిగడ్డ పర్యటనకు సిద్ధమయ్యారు. గతంలోనూ ఇదే తీరుగా వ్యవహరించి పలుచనయ్యారు.
- ప్రజల దృష్టి మరల్చేందుకు కొత్త ఎత్తులు
- అదేరోజున మేడిగడ్డ పర్యటనకు నిర్ణయం
- గతంలోనూ ఇదే తీరుతో కుతంత్రాలు
హైదరాబాద్, ఏప్రిల్15 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి డైవర్షన్ డ్రామాకు తెరలేపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కుతంత్రం పన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ అంటేనే వణికిపోతున్న ఆయన.. జగిత్యాలలో బీఆర్ఎస్ సభ జరిగే 20వ తేదీన్నే మేడిగడ్డ పర్యటనకు సిద్ధమయ్యారు. గతంలోనూ ఇదే తీరుగా వ్యవహరించి పలుచనయ్యారు. అయినా మళ్లీ అలాంటి కుట్రకు సిద్ధమైన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు 20న జగిత్యాలలో భారీ బహిరంగసభ నిర్వహణకు బీఆర్ఎస్ సిద్ధమైంది. గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సభకు హాజరుకానున్నారు. ఆయన సమక్షంలోనే జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్నారు. కేసీఆర్ ఆ సభకు రానున్నారనే విషయం ప్రజల్లో ఇప్పటికే సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నది. సభపై సీఎం రేవంత్‌రెడ్డి సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి కుతంత్రం
ఊహించిన విధంగానే బీఆర్ఎస్ జగిత్యాల సభ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్‌రెడ్డే స్వయంగా పూనుకున్నారు. అదే రోజున మేడిగడ్డ పర్యటన ఖ రారు చేసుకొన్నారు. బరాజ్‌ను సందర్శించాలని నిర్ణయించుకొన్నారు. బరాజ్‌ల మరమ్మతు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అందుకోసం ఇప్పటికే మేడిగడ్డ వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాట్లు చేస్తుండ టం గమనార్హం. ఇప్పుడిదే విషయమై రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్నది. జగిత్యాల స భతో కాంగ్రెస్ ప్రభుత్వం బెంబేలెత్తిపోతున్నదని, దృష్టి మరల్చేందుకే మేడగడ్డ పర్యటనకు తెరతీశారని చర్చించుకుంటున్నరు.
గతంలోనూ ఇదే తీరు
గతంలో అధికార పార్టీకి ఆపదొచ్చినప్పుడల్లా సర్కార్ ఇదే తీరున డైవర్షన్ రాజకీయాలు చేసింది. సర్కార్ ఏర్పడ్డ తొలినాళ్లలో మేడిగడ్డ పర్యటన పేరిట పాలకులు హడావుడి చేశారు. 28 నెలలు గడిచినా ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఆ తర్వాత విజిలెన్స్, జస్టిస్ ఘోష్ కమిషన్ అంటూ విచారణల పేరిట లీకులతో దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వ పెద్దలు పబ్బం గడిపారు. ఎన్డీఎస్ఏ నివేదికనూ నిరుడు బీఆర్ఎస్ ప్లీనరీకి రెండు రోజుల ముందే తెరపైకి తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చేందుకు యత్నించారు. తాజాగా మరోసారి అదే తరహా డైవర్షన్‌కు తెరతీశారు. కాం గ్రెస్ సర్కార్ వరుస వైఫల్యాలు, రైతులు సహా అన్నివర్గాల్లో పెల్లుబుకుతున్న అసంతృప్త జ్వాలలు, కేసీఆర్ సారే రావాలం టూ వినిపిస్తున్న తెలంగాణ జనం మనోగతాలు.. ఇంకేముంది! కాంగ్రెస్‌కు కేసీఆర్ భయం పట్టుకున్నది. దీంతో ఇన్నా ళ్లూ మీనమేషాలు లెక్కించిన ప్రభుత్వం.. గత 4 రోజులుగానే హడావుడి చేస్తున్నది. అం దులోని ఆంతర్యమేమిటో తాజాగా రేవంత్‌రెడ్డి పర్యటన ఖరారుతో తేటతెల్లమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

