Bakka Judson | యువత టార్గెట్ ధర్మేంద్ర ప్రధాన్ కాదు.. వాళ్లు ప్రధాని నరేంద్రమోదీనే టార్గెట్ చేశారని.. ఇవాళ మోదీ దేశం వదిలి వెళ్లిపోయే పరిస్థితి కూడా రావొచ్చని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ అభిప్రాయపడ్డారు. బక్క జడ్సన్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీవాళ్లు మూసుకునే పరిస్థితి వచ్చిందని.. వాళ్లు మాట్లాడే మాటలు.. సోషల్ మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మరు. బీజేపోళ్లు గుడిని, గుడిలో ఉండే లింగాన్ని మింగే రకాలని మీ గురించి జనాలకు తెలిసిపోయిందన్నారు.
ఇన్ని రోజులు మిమ్మల్ని భక్తులనుకున్నారు. మీ మురళీ మనోహర్ జోషి కూడా బయటకు వచ్చిండు. నేడో రేపో అద్వానీ కూడా బయటకు వస్తడు. మోదీ కూడా దేశం విడిచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చినా రావొచ్చన్నారు. ఇవాళ ఆయనకు ఎవరు శత్రువులో కూడా తెలియదు. ఆయన పక్కనున్న ఎస్పీజీ వాళ్ల పిల్లలు కూడా పరీక్షలు రాసినోళ్లే ఉంటరు. బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతనే ఈ జెన్ జీ ఉద్యమానికి కారణమని.. మోదీ దిగితే ఈ ఉద్యమం ఆగుతుందని బక్క జడ్సన్ స్పష్టం చేశారు. జెన్ జీ మూవ్మెంట్ అనేది చాలా డేంజర్, ఇక్కడిదాకా పరిస్థితి రానీయొద్దు.. వచ్చిందంటే ఏ ప్రభుత్వం ఉండదని హెచ్చరించారు.
యువత టార్గెట్ ధర్మేంద్ర ప్రధాన్ కాదు.. మోదీనే
ఇవాళ మోదీ దేశం వదిలి వెళ్లిపోయే పరిస్థితి కూడా రావొచ్చు
బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతనే ఈ జెన్ జీ ఉద్యమానికి కారణం.. మోదీ దిగితే ఈ ఉద్యమం ఆగుతుంది
జెన్ జీ మూవ్మెంట్ అనేది చాలా డేంజర్, ఇక్కడిదాకా పరిస్థితి రానీయొద్దు.. వచ్చిందంటే ఏ… https://t.co/FowSEGy1Ug pic.twitter.com/56skFpKHXv
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2026