సమాధానం చెప్పలేకే కేటీఆర్‌పై దూషణలు
వరంగల్ రైతు సంగ్రామ సభలో కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు.
- రైతు డిక్లరేషన్ అమలు చేయాలి
- పీసీసీ చీఫ్ క్షమాపణలు చెప్పాలి
- బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : వరంగల్ రైతు సంగ్రామ సభలో కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. తెలంగాణ రైతాంగం పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అంత ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు.
బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చే కమీషన్లకు ఆశపడే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇబ్బందులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ది 420 ఫ్యామిలీ కాదని, రాహుల్‌గాంధీదే దేశంలోనే 420 కుటుంబమని దుయ్యబట్టారు. ఉద్యమ చరిత్ర కలిగిన కేసీఆర్, కేటీఆర్‌పై ఇష్టారీతిన మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

