Garima agarwal | రాయపోల్, జులై 31 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని ఉద్యోగుల హాజరు రిజిస్టరు, ఓపీ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ మొదలైనవి పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, మందుల గురించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహారాజు, ఇతర సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రి ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాయపోల్ మండలం రామారం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి సంబంధిత లబ్ధిదారులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకున్న ప్రతీ ఒక్కరికి డబ్బులు మంజూరు అవుతాయని ఇండ్లు లేని నిరుపేద ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
తనిఖీలో భాగంగా కొంతమంది లబ్ధిదారులు తమకు బిల్లులు రాలేదని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ను అడిగారు. అక్కడి నుంచే గరిమా అగర్వాల్ హౌసింగ్ పీడీతో మాట్లాడగా, సాంకేతిక కారణాల వలన రామారం గ్రామ పంచాయతీకి సంబంధించిన రెండు బిల్లులు నిలిచిపోయాయని త్వరలోనే పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలయ్య, తహసిల్దార్ కృష్ణమోహన్, ఎంపీఓ శ్రీనివాస్, ఎంఈఓ సత్యనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మాధవి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
MEO Gajjela Kanakaraju | విద్యార్థులకు జీవ వైవిధ్యం పాఠ్యాంశాలు బోధించాలి : ఎంఈఓ గజ్జెల కనకరాజు
Child laborers | బాల కార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు : ఎస్ఐ మానస