Ganesh chaturthi | శ్రీశైలంలో 10 నుంచి గణేశ్ నవరాత్రోత్సవాలు

శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ లవన్న తెలిపారు. ఉత్సవాలు 19వ తేదీ వరకు కొనసాగుతాయని, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలోని రత్నగర్భ గణపతికి, సాక్షిగణపతి స్వామికి, మట్టితో చేసే మృతికా గణపతి స్వామివారికి ప్రతిరోజు వ్రతకల్ప పూర్వక ప్రత్యేక పూజాధికాలు జరుగుతాయని వివరించారు. శుక్రవారం ఉదయం యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, గణపతిపూజ, పుణ్యాహవచనం, కంకణపూజ, రుత్విగణం కార్యక్రమాలతో ప్రారంభమై.. చివరిరోజు కలశోద్వాసన, పూర్ణాహుతి, అవబృదం, మహాదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, నిమజ్జనం వేడుకలతో ఉత్సవాలు పూర్తవుతాయని చెప్పారు. కొవిడ్ నిబంధనల మేరకు భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

