ఫేక్ సర్టిఫికెట్లతో జేఎల్ ఉద్యోగాలు.. ఉమ్మడి నల్లగొండలో నలుగురికి షోకాజ్ నోటీసులు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నకిలీ సర్టిఫికెట్స్తో ఉద్యోగంలో చేరి కొనసాగుతున్న వారి భాగోతం వెలుగు చూసింది. కాంట్రాక్ట్ లెక్చరర్స్ బాధలు చూసిన అప్పటి బీఆర్ఎస్ సర్కార్ జూనియర్ లెక్టరర్స్ను రెగ్యూలర్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిలో పలువురు నకిలీ సర్టిఫికెట్స్తో...
రామగిరి, ఆగస్టు 08 : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నకిలీ సర్టిఫికెట్స్తో ఉద్యోగంలో చేరి కొనసాగుతున్న వారి భాగోతం వెలుగు చూసింది. కాంట్రాక్ట్ లెక్చరర్స్ బాధలు చూసిన అప్పటి బీఆర్ఎస్ సర్కార్ జూనియర్ లెక్టరర్స్ను రెగ్యూలర్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిలో పలువురు నకిలీ సర్టిఫికెట్స్తో ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు. వీరు ఇతర రాష్ట్రాలోని పలు యూనివర్సిటీల్లో పీజీ, ఇతర కోర్సులు పూర్తి చేసినట్లు వాటిని ఇంటర్మీడియేట్ బోర్డుకు అందచేసి ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తుంది. వీరిని గుర్తించిన ఇంటర్మీడియేట్ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా 37 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నలుగురు ఉండటం గమనార్హం. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజీక్స్ అధ్యాపకురాలు, సూర్యాపేట, కోదాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సబ్జెక్టులు బోధించే మహిళా అధ్యాపకురాలు, సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోటని అధ్యాపకుడికి నోటీసులు అందినట్లు సమాచారం. వీరంతా వారం రోజుల్లోగా ఇంటర్మీడియేట్ బోర్డుకు పూర్తి ఆధారాలను సమర్పించాలని నోటీసులో అధికారులు పేర్కొన్నారు. అధ్యాపకులు ఇచ్చే సమాదానం ఆధారంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

