– మంత్రి ఉత్తమ్‌కు మలి దశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడి వినతి
కోదాడ, సెప్టెంబర్ 02 : మలిదశ ఉద్యమకారులకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ మలి దశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా రాయపూడి వెంకటనారాయణ మంగళవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. మలిదశ ఉద్యమకారులను సముచితంగా గౌరవించాలని, 250 గజాల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలన్నారు. దీంతో పాటు పింఛన్లు మంజూరు చేయాలన్నారు.
తెలంగాణ అమరుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. అలాగేవారి వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని, పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించాలని కోరారు. ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలన్నారు. విజ్ఞప్తులపై మంత్రి ఉత్తమ సానుకూలంగా స్పందించారని, మంత్రివర్గ సమావేశంలో చర్చించి హామీలను నెరవేరుస్తామని భరోసా ఇచ్చినట్టు వెంకటనారాయణ తెలిపారు.