హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఐడీబీఐ బ్యాంక్‌లో జరిగిన కోట్లాది రూపాయల మోసం కేసులో మరో నిందితుడు భూక్యా సురేశ్‌ను సీఐడీ శుక్రవారం అరెస్టు చేసినట్టు డీజీ శిఖాగోయెల్ తెలిపారు. ఈ కేసులో సురేశ్ ఆరో నిందితుడిగా ఉన్నాడు.
సత్తుపల్లి బ్రాంచ్‌కు చెందిన మాజీ మేనేజర్ నల్లగోపుల రమేశ్ అనే బ్యాంకు ఉద్యోగి, బిజినెస్ కారెస్పాండెంట్ చెట్టిపోగు సురేశ్, ఇతర సహచరులతో కలిసి నకిలీ రాబడి పత్రాలను సృష్టించి, బ్యాంకు నిబంధనలు ఉల్లంఘిస్తూ రూ.2.86 కోట్ల విలువైన లోన్లు మంజూరు చేయించినట్టు తేలింది. భూక్యా సురేశ్ (37) ప్రస్తుతం ముంబైలోని ఐడీబీఐ బ్యాంక్ సీబీడీ బెలాపూర్ శాఖలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో సత్తుపల్లి బ్రాంచ్‌లో ప్రాపర్టీ అధికారిగా పనిచేశాడు. కరీంనగర్ సీఐడీ ఆర్జెఓ ఇన్స్పెక్టర్ జే రాము బృందాన్ని శిఖాగోయెల్ ప్రశంసించారు.