హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): మద్యం మత్తులో ఇద్దరు కార్లను అతివేగంగా నడిపి నలుగురి ప్రాణాలు తీశారు. ఉప్పల్‌కు చెందిన రోహిత్‌గౌడ్, సా యిసోమన్ అర్ధరాత్రి వరకు మద్యం సేవించా రు. రోహిత్‌గౌడ్ ఖరీదైన కారులో 100 వేగం తో వెళ్తూ బంజారాహిల్స్ రోడ్డు నంబర్-2 లో రోడ్డు దాటుతున్న రెయిన్బో దవాఖాన ఉద్యోగులైన దేవేందర్ కుమార్దాస్, అయోధ్య రా య్లను ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. నిందితులను బంజారాహి ల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగికి చెం దిన సంజీవ మద్యం మత్తులో 1.30 గంటలకు గండిపేట్ ఓషియన్పార్క్ రోడ్డులో బైక్‌పై వెళ్తున్న దంపతులు రాజు, మౌనికను ఎదురుగా వెళ్లి ఢీకొట్టాడు. వారు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కోకాపేటకు చెందిన దంపతులమృతితో పిల్లలు అనాథలుగా మారారు.