పెద్దేముల్, మే 10: వికారాబాద్ జిల్లా రుక్మాపూర్ గ్రామ శివారులో సాధారణ కూలీలుగా పనిలో చేరిన నలుగురు మావోయిస్టులను తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. తాండూరు రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలోని రుక్మాపూర్ గ్రామ శివారులో రైల్వే పనులు కొనసాగుతున్నాయి.
మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నలుగురు మావోయిస్టులు రుక్మాపూర్ రైల్వేస్టేషన్లో పరిధిలో ఇటీవల కూలీ పనులకు కుదిరి, పదిరోజులుగా వారు అక్కడే ఉంటున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా అక్కడ పనిచేస్తున్న వారిలో మావోయిస్టులు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర పోలీసులు స్థానిక తాండూరు పోలీసుల సహాయంతో రుక్మాపూర్ రైల్వే హెడ్కార్వర్పై దాడి చేసి నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకొని మహారాష్ట్రకు తరలించారు.