జగిత్యాల : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఊరు ఊరికో జమ్మి చెట్టు (Jammi tree ) గుడి, గుడికో జమ్మి చెట్టును చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ( Former MLA Sunke Ravishankar ) శుక్రవారం జగిత్యాల (Jagityala) జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగిన చెట్టుగా, భక్తి పూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్టును తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా గుర్తించిందని తెలిపారు. అనేక కారణాలతో అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో ఉండేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు.
ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ కొండగట్టు తిరుపతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రామ్మోహన్ రావు, ఫాక్స్ చైర్మన్ మధుసూదన్ రావు, రాంపూర్ మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు జనగం శ్రీనివాస్, వేదపెండితులు తదితరులు పాల్గొన్నారు.