కొల్లాపూర్ : కొల్లాపూర్ ( Kollapur ) మండలం సింగోటం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సంపత్ కుమార్ శర్మ సతీమణి ఓరుగంటి రాజేశ్వరమ్మ ( Oruganti Rajeshwaramma ) శుక్రవారం రాత్రి గుండె పోటుతో మరణించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ( Former MLA Beeram Harsavardan Reddy ) శనివారం వారి స్వగృహానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలతో నివాళి ( Tirbute ) అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
నిత్యం దైవకార్యంలో ఆధ్యాత్మిక సేవలో ఉన్న ఓరుగంటి సంపత్ కుమార్ శర్మ, కుమారుడు ఓరుగంటి సతీష్ కుమార్ శర్మలకు తోడు ఉండటంతో పాటు అందర్నీ ఎంతో ఆప్యాయంగా పిలిచే ఓరుగంటి రాజేశ్వరమ్మ మృతి కుటుంబ సభ్యులకు మాత్రమే కాక గ్రామస్థులకు భక్తులకు తీరని లోటు ఏర్పడిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారితో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.