PM Modi : ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. ఈ నెలలో ఫ్రాన్స్, స్లొవేకియా దేశాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో జరిగే జీ7 దేశాల సదస్సుకు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ ముందుగా జూన్ 13, 14 తేదీల్లో ఫ్రాన్స్‌లోని నైస్‌లో పర్యటిస్తారు. మళ్లీ జూన్ 16 నుంచి 19 వరకు కూడా ఫ్రాన్స్‌లోనే పర్యటిస్తారు.
మధ్యలో రెండు రోజులపాటు అంటే.. 14, 16 వరకు స్లొవేకియాలో పర్యటిస్తారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా అక్కడి అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మ్యాక్రోన్తో భేటీ అవుతారు. నైస్‌లో అక్కడ మోదీ.. మ్యాక్రోన్తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. ఇద్దరు కలిసి భారత్ ఇన్నోవోట్స్ ఈవెంట్లో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య ఇన్నోవేషన్ స్టార్టప్స్‌ను పెంచడం, భారీ పెట్టుబడులను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో దీన్ని నిర్వహిస్తున్నారు. అనంతరం జూన్ 14న మోదీ స్లొవేకియా బయల్దేరుతారు. అక్కడ 15, 16 తేదీలలో ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోతో మోదీ సమావేశమవుతారు. 1993 తర్వాత భారత ప్రధాని స్లొవేకియాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిస సంబంధాలు, వ్యాపారం, పెట్టుబడులు, ఆటోమొబైల్ వంటి అంశాలపై చర్చిస్తారు. ఇక్కడ భేటీ అనంతరం మోదీ తిరిగి ఫ్రాన్స్ చేరుకుంటారు. జూన్ 16,17 తేదీల్లో అక్కడి ఎవియన్ పట్టణంలో జరిగే జీ7 దేశాల సదస్సులో మోదీ పాల్గొంటారు. 18వ తేదీన ప్యారిస్‌లో జరిగే వివా టెక్ సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ సందర్బంగా ఇండియన్స్‌తో కూడా మోదీ సమావేశం అవుతారు.