Donald Trump | హెలికాప్టర్ కూల్చివేత ఘటనపై ట్రంప్ సీరియస్.. ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
Donald Trump : హార్ముజ్ జలసంధి వద్ద అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ముందుగా ఇరాన్ వెల్లడించింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని అంగీకరించారు.
Donald Trump : హార్ముజ్ జలసంధి వద్ద అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ముందుగా ఇరాన్ వెల్లడించింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని అంగీకరించారు. ఇరాన్ తమ అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసిందన్నారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అలాగే, అమెరికా ప్రభుత్వం కూడా తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.
‘‘హార్ముజ్ జలసంధిపై వెళ్తుండగా ఆధునిక, ప్రభావవంతమైన అపాచీ హెలికాప్టర్లను గత రాత్రి ఇరాన్ కూల్చివేసిందని అమెరికా మిలిటరీ విభాగం తెలిపింది. ఈ హెలికాప్టర్లో ఇద్దరు పైలట్లు ఉండగా, వారు గాయాలులేకుండా, సురక్షితంగా బయటపడ్డారు. ఈ దాడిపై అమెరికా ప్రతిదాడికి స్పందించాలి” అని ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై దాడి తప్పదంటూ హెచ్చరించారు. అమెరికా ఆర్మీకి చెందిన ఏహెచ్64 అనే విమానం సోమవారం రాత్రి హార్ముజ్ జలసంధివైపు వెళ్తుండగా, ఒమన్ తీరంలో ఇరాన్ కూల్చివేసింది. ఈ హెలికాప్టర్ నడుపుతున్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. వారిని రెండు గంటల తర్వాత అమెరికా దళాలు రక్షించాయి. అమెరికాకు చెందిన యూఎస్ నావల్ సెంట్రల్ కమాండ్ విభాగం పైలట్లను రక్షించింది.
“I have just been informed by our Great Military that last night the Iranians shot down one of our highly sophisticated Apache Helicopters while patrolling over the Strait of Hormuz. There were two pilots involved, both are safe and uninjured. Nevertheless, the United States… pic.twitter.com/yMGXqG89ax
— The White House (@WhiteHouse) June 9, 2026
అయితే, హెలికాప్టర్‌పై ఇరాన్ ఎలా దాడి చేసింది అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే, ఇరాన్ చర్య రెండు దేశాల మధ్య చర్చలకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఒకవైపు ట్రంప్.. ఇరాన్‌పై దాడులు చేయొద్దని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు సూచించారు. అలాంటిది, ఇరాన్ మాత్రం అమెరికా హెలికాప్టర్‌ను కూల్చేసింది. మరోవైపు ఇజ్రాయెల్.. లెబనాన్‌పై దాడులు చేస్తోంది. త్వరలోనే అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కొలిక్కి వస్తాయని, ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నామని ట్రంప్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

