మక్తల్, ఫిబ్రవరి 10 : మంత్రి వాకిటి శ్రీహరి అనుచరు లు బీజేపీ అభ్యర్థిని బెదిరింపులకు గురి చేయడంతో సదరు అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మక్తల్ మున్సిపాలిటీలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మక్తల్ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా, చందాపురం, తిర్లాపురం గ్రామాలను కలుపుకొని మక్తల్ మున్సిపాలిటీ ఏర్పడింది. తాజాగా మున్సిపల్ రెండో సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మక్తల్ మున్సిపాలిటీలోని ఆరోవార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వుడ్ కావడంతో చందాపూర్ గ్రామానికి చెందిన ఎరుకలి మహదేవప్ప(45) బీజేపీ నుంచి బరిలో నిలిచా డు.
పోటీ చేసిన నాటి నుంచి చందాపురం వార్డు సభ్యుడిగా ఎలా గే లుస్తావో చూస్తాం.. నీ అంతు చూస్తామంటూ కాంగ్రెస్ నాయకులు నిత్యం భయబ్రాంతులకు గురిచేస్తుండడంతో మనస్తాపానికి గురైన మహదేవప్ప మంగళవారం తెల్లవారు జామున ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆ త్మహత్య చేసుకున్నాడు. మహదేవప్ప ఆత్మహత్య విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున చందాపూర్‌కు చేరుకొన్నారు. అయితే మక్తల్ పోలీసులు ఓవరాక్షన్ చేసి మృతుడి భార్య సత్యమ్మతో బలవంతంగా సంతకం తీసుకొని సాదారణ మృతిగా చిత్రీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ డీకే అరుణలు మక్తల్ ప్రభుత్వ దవాఖానకు వద్దకు చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి బీజేపీ అభ్యర్థి మహదేవప్ప కాంగ్రెస్ నాయకులు చేసిన వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు.
ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎన్నికలలో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రికి మింగు డు పడకపోవడంతోనే ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు ఉద్యోగులుగా వ్యవహరించాలి కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని మృతుడి కు టుంబ సభ్యులతో బలవంతంగా సంతకాలు చేసుకోవడం ఏంటని ప్రశ్శించారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను మార్చి మృతుడు కుటుంబ సభ్యులు చెప్పిన విధంగాఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పట్టుబట్టడంతో చేసేదిలేక డీఎస్పీ లింగయ్య మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారమే కేసు నమోదు చేసుకొని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుటుంబాన్ని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం..
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్టీలకు భద్రత లేకుండా పోవడంతోనే ఇలాంటి రాజకీయ హత్య లు జరుగుతున్నాయని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్‌నాయక్ ఆరోపించారు. మంగళవారం మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డు చందాపూర్ గ్రామానికి చెందిన ఎరుకలి మహాదేవప్ప కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులకు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీనిస్తూ కుటుంబసభ్యులతో మాట్లాడి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. భార్య సత్యమ్మ, కూతురు అనూష, స్వాతి, కుమారుడు ఆనంద్‌లతో మా ట్లాడి ఎవరెవరి నుండి ఒత్తిళ్లు వచ్చాయో కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేసేందుకే రేవంత్‌రెడ్డి సారథ్యంలో ముందుకు సాగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఎస్టీలకు భద్రతా లేకుం డా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మక్తల్‌లో ఎరుకలి మహదేవప్ప విజయాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు భారీ స్థాయిలో వేధింపులకు గురి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు ఆత్మహత్య చేసుకున్న మహాదేవప్ప మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి మరణంపై పోలీసులు బలవంతంగా కేసు నమో దు చేసుకునే విధంగా కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేయడం కూడా శోచనీయం అన్నారు. ఈ ఘటనలో పోలీసులు పాత్ర ఉందని తెలిస్తే వారి పైన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని అన్నారు. రెండు మూడు రోజు ల్లో పూర్తి స్టేట్మెంట్ తెప్పించుకొని బాధితులకు న్యాయం చేస్తామని బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు.
దిగ్భ్రాంతికి గురిచేసింది : చిట్టెం
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన 6వ వార్డు అభ్యర్థి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వాకిటి శ్రీహరి ఆయన అనుచరులు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడంతోపాటు బలవంతంగా తమ పార్టీ కండువాలను కప్పుతూ అరాచకాలకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు తట్టుకోలేక మక్తల్ నియోజకవర్గంలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకోవ డం ఎంతో బాధను కలిగించిందన్నారు.
గతంలో కూడా నర్వ మండల కేంద్రంలో మంత్రి అనుచరులు బెదిరించడంతో శ్రీనివాస్‌రెడ్డి అనే కార్యకర్త పురుగుల మందు తాగి చనిపోయారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతు న్న తరుణంలో మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు నుంచి ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి మహదేవప్పను కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించడంతోనే మృతి చెందారని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ పోలీసులు ఓవరాక్షన్ చేస్తూ అభ్యర్థి ఫోన్ లాకొని వెళ్లడం ఎంతవరకు స మంజసం అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి రోడ్డుపై చిన్న ప్రమాదం జరిగినా మానవత్వాన్ని చాటుకుంటాడని గొప్ప లు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు మున్సిపాలిటీలో వ్యక్తి చనిపోతే కనీసం కుటుంబాన్ని పరామర్శించకుండా అటువైపు కన్నెత్తి చూడకపోవడం కాంగ్రెస్ పార్టీకి, అభ్యర్థి మరణానికి సంబంధం ఉన్నట్లు బహిర్గతమవుతుందని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఏ పార్టీ నుంచి అయినా అభ్యర్థులు పోటీ చేయొచ్చని, గెలుపోటములు ఓటర్లు నిర్వహిస్తారని, అభ్యర్థులు చనిపోయే విధంగా బెదిరింపులతో రాజకీయాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా మంత్రి వాకిటి శ్రీహరి తన అనుచరగణాన్ని అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదురోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వ్యాఖ్యనించారు. అంతకుముందు ఆయన చందాపూర్‌లోని మృతుడి కు టుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట సర్పం చ్ గాలిరెడ్డి, నాయకులు అశోక్‌గౌడ్, అంజిగౌడ్ ఉన్నారు.