మాదాపూర్, ఫిబ్రవరి 10 : మాదాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వివరాల ప్రకారం .. మాదాపూర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గండ్ర వినయ్ కుమార్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఐటీ కంపెనీ కన్సల్టెన్సీ కంపెనీ కేసు విషయంలో కోర్టు నుంచి ఆర్డర్ కాపీ ఉన్నప్పటికీ 35 (3) బీఎన్ఎస్ఎస్ నోటీసును ఇవ్వడానికి ఎస్ఐ వినయ్ జాప్యం చేస్తూ (సీఆర్ నెంబర్ 2202/2025) వచ్చాడు.
నోటీసు కోసం సదరు బాధితుడు ఎస్ఐ వినయ్‌ను అడగడంతో రూ. 1 లక్ష లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారుల బృందం ట్రాప్ చేసి ఎస్ఐ వినయ్‌ను మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. లంచం డిమాండ్ చేస్తే 1064 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.