వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.16,500 స్వాధీనం చేసుకున్నారు.
విద్యుత్తుశాఖ ఏఈ అనిల్‌కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. 2023 ఫిబ్రవరిలో కీసరలో ఏఈగా పనిచేసిన అనిల్‌కుమార్ అప్పట్లో రూ.12 వేలు లంచం తీసుంటుండగా ఏసీబీకి చిక్కారు.