బండ్లగూడ, ఫిబ్రవరి 10 : రాజేంద్రనగర్ సర్కిల్, ఉప్పర్‌పల్లిలోని మారుతీ సుజుకి కారు సర్వీసింగ్ సెంటర్లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. ఒక్క సారిగా చెలరేగిన మంటలతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యారు. స్థానికుల సమాచారం మేరకు రాజేంద్రనగర్ అగ్నిమాపక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దట్టమైన పొ గలు అలుముకోవడంతో అపార్ట్‌మెంట్‌వాసులను కిందకు దించా రు.
ఈ అగ్నిప్రమాదంలో సర్వీసింగ్ కోసం వచ్చిన రెండు కార్లు దహనం కాగా ఒక కారు పాక్షికంగా కాలిపోయింది. కార్ల సామగ్రి పక్కనే ఉండటంలో మంటలు అంటుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. సర్వీసింగ్ సెంట ర్ నిర్వాహకులు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అం టించి ఉంటారని ఆరోపించారు. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.