మహబూబ్‌నగర్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలిచి.. రెండున్నరేండ్లలోనే కొల్లూరులో రూ.వంద కోట్లు పెట్టి ఆస్తులు కొన్నవా? లేదా? అంత డబ్బు ఎలా సంపాదించావు? నీ అవినీతి చిట్టా విప్పుతా.. కూకట్పల్లి బాంబు నా చేతుల్లో ఉంది బిడ్డా.. జాగ్రత్త.. డిసెంబర్ 9 వరకు టైం ఇస్తున్నా పద్ధతి మార్చుకో.. పెద్ద, చిన్న అనే గౌరవం లేకుండా కేటీఆర్‌ను, హరీశ్‌రావును అనేటంత మొనగాడివా? నీ భాష, అబద్ధపు ప్రచారం ఆపకపోతే మా తడాఖా ఏమిటో చూపుతాం’.. అంటూ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఘాటు గా హెచ్చరించారు.
ఇసుక, మైనింగ్ మాఫి యా వెనుక ఉన్నది నువ్వు, నీ సోదరుడు కాదా..? అని ఆరోపించారు. శుక్రవారం దేవరకద్రలో మీడియాతో ఆయన మాట్లాడుతూ నువ్వు అడ్వకేట్‌గా వచ్చి ఎమ్మెల్యే అయిన త ర్వాత.. కాంట్రాక్టర్ అయ్యావు.. రెండున్నరేండ్ల్లలోనే రూ.100 కోట్లు పెట్టి ఆస్తి సంపాదించింది వాస్తవమా? కాదా?.. ఆధారాలతో సహా బయట పెడతానన్నారు. అది రహస్యమైతే నీ అడ్వకేట్లకు చెప్పు ఇంత తక్కువ టైంలో అన్ని కోట్లు ఎలా వెనకేసుకొచ్చావ్.. ఇదంతా అవినీతి సొమ్ము కాదా? అంటూ ప్రశ్నించారు. నీవు మాట్లాడే భాష జుగుప్సాకరంగా ఉందన్నారు. దేవరకద్ర నియోజకవర్గానికి ఏదో చేశావన్న బిల్డప్ ఇస్తున్నావని ధ్వజమెత్తారు. ప్రజలు అవకాశం ఇచ్చారని మొదట్లో మేము ఏం అనలేదు.. కానీ మాపై అబద్ధపు ప్రచారం చేస్తున్నావు.. రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్లు వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని భావించామన్నారు.
పదేండ్ల్లు ఎమ్మెల్యేగా ఉండి సివిల్ ఇంజినీర్‌గా సొం తంగా ఆలోచించి కోయిల్‌సాగర్ ప్రాజెక్ట్ నుం చి గ్రావిటీ కెనాల్ ద్వారా 11 గ్రామాలకు సా గునీరు అందించామన్నారు. పెద్ద వాగు, ఊక చెట్టు వాగుల మీద 36 చెక్‌డ్యాంల నిర్మించి సజీవంగా ఉంచామని గుర్తు చేశారు. కేవలం చెక్ డ్యాంలతో 20వేల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు లభిస్తుందన్నారు. తక్కు వ ఖర్చుతో బండర్‌పల్లి వద్ద చెక్ డ్యాం నిర్మిస్తే ఏడాది పొడవునా నీళ్లు నిలుస్తున్నాయన్నారు. కరివెన రిజర్వాయర్ పాలమూరు ప్రాజెక్టు డిజైన్‌లో లేదు.. తానే స్వయంగా అక్కడ తిరిగి రిజర్వాయర్ నిర్మాణం చేయించేలా కేసీఆర్‌ను ఒప్పించినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసు లు బనాయించావని మండిపడ్డారు.
స్థానిక ఎమ్మెల్యే తన న్యాయవాద తెలివితో బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు, సెక్షన్లు, ఎఫ్ఐఆర్, చార్జీషీట్ ఎలా ఫైల్ చేయాలో పో లీసులకు డైరెక్షన్ ఇస్తున్నారని మండిపడ్డారు. తన పైన కూడా కేసులు బనాయించేందుకు కుట్ర చేస్తున్నారని అక్రమ కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఇథనల్ ఫ్యాక్టరీకి సమీపంలో ఇంటిగ్రేటేడ్ స్కూల్ కట్టడంతో విద్యార్థులకు నష్టం జరుగుతుందని.. కాలు ష్యం బారిన పడతారని స్థలం మార్చమని అ డిగితే మా కార్యకర్తపై కేసు పెట్టి జైలులో వేశావని ధ్వజమెత్తారు. పదేండ్ల కింద ఉన్న కేసు లు బయటకు తీసి జైలుకి పంపడం చూస్తుం టే.. ఇదెక్కడి దౌర్భాగ్యం అనిపిస్తుందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ల మీద కేసులు పెట్టడం చూస్తుంటే రేపు వెంట ఉండే కాంగ్రెస్ నాయకులకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
‘కురుమూర్తి స్వామి సాక్షిగా చెబుతున్నా నల్లమట్టిలో అవినీతి చేయలేదు.. విద్యుత్ బకాయిలు ఎగ్గొట్టలేదు.. దమ్ముంటే నవ్వు చేసిన ఆరోపణలపై చర్చకు కురుమూర్తి స్వా మి ఆలయం వద్దకు రావాలి’ అని అల సవాల్ విసిరారు. రిజర్వాయర్లు కట్టాలంటే కోట్ల క్యూబిక్ మీటర్ల నల్ల మట్టి అవసరం ఉంటుందని, చెరువుల్లో మట్టి తీసి రిజర్వాయర్ నిర్మించాం.. నీటి నిల్వ పెంచినం అన్నా రు. మిషన్ కాకతీయలో చెరువుల్లో మట్టి తీస్తే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చినం.. ప్రభుత్వానికి రాయల్టీ కట్టినమని వివరించారు. నేను అవినీతికి పాల్పడలేదని.. నువ్వు ఎమ్మెల్యే అయ్యాక ఆరు గ్యారెంటీలను అమలు చేశావంటే కురుమూర్తి స్వామి వద్దకు వెళ్దాం.. ప్రమాణం చేద్దాం.. అని సవాల్ చేశారు.
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని నువ్వు కురుమూర్తి స్వామి వద్ద బాండ్ పేపర్లు రాసి సంతకం పెట్టావు.. గుర్తులేదా? అంటూ నిలదీశారు. దేవుడు ఎవరిని శిక్షిస్తాడో చూద్దాం.. అని అన్నారు. రెండున్నర ఏండ్ల్లలో నేను ఎన్నో చేశా.. మళ్లీ ఎమ్మెల్యేగా నిలబడితే 50 వేల మెజారిటీతో గెలుస్తా అని ధీమా వ్యక్తం చేశారు. నీ పనితీరుపై నమ్మకం ఉంటే రాజీనామా చేసి పోటీ చేయ్.. మళ్లీ నువ్వు గెలిస్తే నేను జీవితంలో ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేయనన్నారు. కరివెన 90 శాతం పూర్తి చేస్తే పెండింగ్ పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
నువ్వు అడ్వకేట్‌గా ఉండి వాడరాని భాష మాట్లాడడం ప్రజాప్రతినిధిగా తగదన్నారు. నీ తమ్ముడు చెక్ డ్యాంలు కడితే అప్పుడే కొట్టుకుపోయింది.. మా హయాం లో 36 చెక్ డ్యాములు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో ప్రతి మండలంలో జోరుగా ఇసుక అక్రమ దందా జరుగుతోంది.. ప్రతి బండికి ఓ రేట్ కట్టి వసూలు చేస్తూ రోజు రూ.లక్షలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లో నా ఆస్తుల వివరాలు ఉన్నా యి.. అవి కాకుండా ఎక్కువ ఉంటే చెప్పు.. ప్రజలకు ఇచ్చేస్తా.. అంటూ సవాల్ చేశారు. నీ ఆస్తుల చిట్టా కూడా నా దగ్గర ఉంది.. త్వర లో ఆధారాలతో సహా బయట పెడతా అని హెచ్చరించారు. నేను నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చాను.. ఎమ్మెల్యే అయ్యానన్నారు.
దేవరకద్రలో ఎక్కడికెళ్లినా కేసీఆర్.. నా ఆనవాళ్లు ఉంటాయి.. అన్నారు. మేము తెచ్చిన పనులకు బోర్డులు పెట్టడం నీకు అలవాటైందని, నీవు కూకట్‌పల్లిలో ఏం చేస్తున్నావో తెలుసు.. భాష మార్చుకోపోతే వీడియోలు, ఫొటోలు బయటికి వస్తాయని.. బాంబు పేలుస్తా బిడ్డా అంటూ హెచ్చరించా రు. సమావేశంలో దేవరకద్ర బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వేణుగోపాల్, పీఏసీసీఎస్ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, ముడా మాజీ డైరెక్టర్ రాజు, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు కొండారెడ్డి, నాయకులు సంతోష్‌రెడ్డి, ఆంజనేయు లు, మోహన్‌గౌడ్, బాలరాజు , భాస్కర్‌రెడ్డి, సర్పంచులు, నాయకులు పాలొన్నారు.