ఉమ్మడి పాలమూరును కరువు జిల్లాగా ప్రకటించాల్సిందే
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను కరువు ప్రాంతం గా ప్రకటించి.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించకపోతే అన్ని జిల్లాల రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.
- లేదంటే రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తం
- సర్కార్‌కు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరిక
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 30 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను కరువు ప్రాంతం గా ప్రకటించి.. పంట
నష్టపోయిన రైతులకు పరిహారం అందించకపోతే అన్ని జిల్లాల రైతులతో కలిసి సచివాలయాన్ని
ముట్టడిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాగర్‌కర్నూల్, వనపర్తి,
నారాయణపేట, జోగుళాంబ గద్వా ల, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అన్ని మం డలాల్లో కరువు పరిస్థితులు
నెలకొని ఉన్నాయని తెలిపారు. జిల్లాపై వివక్ష చూపకుండా ప్రభుత్వం వెంటనే కరువు ప్రాంతంగా
ప్రకటించాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం నాగర్‌కర్నూల్‌లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నివాసంలోని పార్టీ కార్యాలయంలో శ్రీనివాస్‌గౌడ్ మీడియా తో మాట్లాడారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల్లో ఉమ్మడి జిల్లాలో 15 మండలాలపై వివక్ష చూపడం దారుణమని అన్నారు. 15 మండలాల్లో రైతులు తమ పంటలు ఎండుతున్నాయని, సాగు, తాగునీరు అందించాలని ఆందోళన లు చేస్తుంటే.. ఈ ప్రభుత్వానికి కనిపించ డం లేదా? అని ప్రశ్నించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి, మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట తదితర మండలాల్లో వందల ఎకరాలు ఎండిపోయాయని, రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని, పంటలు ఎండిపోయినందుకే ఆందోళనలు చేస్తున్నారనే విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదని నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

