స్టేషన్ ఘనపూర్ : కన్నపల్లి సందర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ను స్టేషన్ ఘనపూర్లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య ( Rajaiah ) ఘన స్వాగతం పలికారు. ఘనాపూర్ జాతీయ రహదారి బస్టాండు సమీపంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా కేటీఆర్కు పుష్ప గుచ్చం అందించారు. బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ పై పూలు చల్లుతూ సీఎం, సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.