Rowdy Janardhana | ‘రౌడీ జనార్దన’లో బాలీవుడ్ భామ.. లైగర్ బ్యూటీతో మళ్లీ రౌడీ స్టార్ రొమాన్స్?
Vijay Deverakonda | టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, క్రేజీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రౌడీ జనార్దన’ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
Ananya Panday | టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, క్రేజీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రౌడీ జనార్దన’ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. పక్కా గ్రామీణ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన జాతీయ అవార్డు గ్రహీత, స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్డేట్ తెగ హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ఒక అదిరిపోయే మాస్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ స్పెషల్ సాంగ్‌లో విజయ్ దేవరకొండతో కలిసి బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే స్టెప్పులు వేయబోతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. గతంలో వీరిద్దరూ ‘లైగర్’ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే, ఒకవేళ ఈ వార్త నిజమైతే మరోసారి ఈ జోడి వెండితెరపై సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ స్పెషల్ సాంగ్ ఆఫర్‌కు అనన్య గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉంటాయని ఇన్సైడ్ టాక్. ముఖ్యంగా ఈ ఫ్లాష్ బ్యాక్‌లో విజయ్ దేవరకొండ మునుపెన్నడూ లేని విధంగా ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఊరమాస్ లుక్‌తో కనిపించబోతున్నాడట. ఇందులో వచ్చే యాక్షన్ సీక్వెన్సులు సినిమా మొత్తానికే మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సినిమాలో సీనియర్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రతో పాటు లుక్ కూడా ఇప్పటివరకు మనం చూడని రీతిలో సరికొత్తగా, ఎంతో పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారట. మొత్తానికి భారీ తారాగణం, అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్, విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్దన’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

