BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
BSF camp : మణిపూర్, ఇంఫాల్‌లోని బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) క్యాంపులో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 75 మంది బీఎస్ఎఫ్ జవాన్లు అస్వస్థతకు గురయ్యారు.
BSF camp : మణిపూర్, ఇంఫాల్‌లోని బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) క్యాంపులో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 75 మంది బీఎస్ఎఫ్ జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. వీరితోపాటు మరో ముగ్గురు పౌరులు కూడా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరందరినీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స అందుతోంది. ఈ ఘటన గురువారం ఉదయం జరిగింది.
ఉదయం బీఎస్ఎఫ్ జవాన్లు, ఇతర సిబ్బంది బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆహారం తిన్న 78 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు మొదలయ్యాయి. దీంతో వెంటనే వారిని అత్యవసర ప్రాతిపదికన స్థానిక రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు. 78 మంది చికిత్స పొందుతుండగా.. వారి పరిస్తితి ప్రస్తుతం స్తిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రాణాపాయం ఏమీ లేదన్నారు.
అయితే, ఈ ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. అందరూ ఒకే ఆహారం తీసుకున్నారా.. వేర్వేరు పదార్థాలా అనేది కూడా తేలాలి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. సంబంధిత ఆహార పదార్థాల్ని అధికారులు సేకరించారు. వాటి పరిశీలన అనంతరం ఈ ఘటనకు గల కారణాలు తెలియరావచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BSF Camp
- Food poison
- Imphal
- Manipur
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

