Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
Satish Kumar | బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకుఎల్లప్పుడూ అండగా ఉంటానని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ తెలిపారు.
సైదాపూర్ : బీఆర్ఎస్ ( BRS ) పార్టీ కార్యకర్తలకుఎల్లప్పుడూ అండగా ఉంటానని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ ( Satish Kumar ) తెలిపారు. మండలంలోని చింతలపల్లి ఫంక్షన్హాల్లో జరిగిన పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ పటిష్టానికి ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు.
కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెల్లాలన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిపై నిరంతరం పోరాటాలు చేయాలని సూచించారు.
పార్టీ మండల అధ్యక్షుడిగా రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పైడిపల్లి రవీందర్ గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండల శాఖ మాజీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య, మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ బిల్ల వెంకటరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చంద శ్రీనివాస్ సర్పంచులు చాడ అఖిలాప్రకాష్రెడ్డి, తొంట రజనీకాంత్, రవీందర్రావు, మేడవేని గోపాల్, ఉప సర్పంచులు వెంగల రవి మోహన్ , మాజీ సర్పంచులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

